ఎందుకంత చిన్నచూపు.. హీరోయిన్స్ నీ ప్రశ్నలు అడగరా : చాందిని చౌదరి

praveen
మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా చాందిరీ చౌదరి హీరోయిన్ గా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా గామి. దాదాపు ఆరేళ్ల నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతూ వచ్చింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండానే మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది ఈ మూవీ. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ వచ్చింది అన్న విషయం తెలిసిందే. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ఈ మూవీ లాభాల బాట పట్టింది  ఈ క్రమంలోనే ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇటీవల కాలంలో సినిమా విడుదలకు ముందు విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత కూడా మేకర్స్ నటీనటులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.

 ఈ క్రమంలోనే ఈ ప్రెస్ మీట్ లో సినిమా సక్సెస్ ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నారు చిత్రబృందం. అయితే ఇటీవలే అందరిలాగానే గామి చిత్ర బృందం కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇక ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ విద్యాధర్ తో పాటు హీరో విశ్వక్సేన్ హీరోయిన్ చాందిని చౌదరి కూడా పాల్గొన్నారు. కాగా ఈ ప్రయోగాత్మక సినిమాకి చాందిని చౌదరి పడిన కష్టానికి ప్రస్తుతం ప్రతిచోట కూడా ప్రశంసలు దక్కుతున్నాయి అని చెప్పాలి. అయితే ఈ ప్రెస్ మీట్ లో ఇక అందరూ చెప్పినట్లుగానే ఈ సినిమాను హిట్ చేసినందుకు హీరో విశ్వక్సేన్ డైరెక్టర్ విద్యాధర్ ఇక అందరికీ థాంక్స్ చెప్పారు. అయితే చాందిని చౌదరి కూడా ఇలాగే అందరికీ థాంక్స్ చెప్పింది.

 కాని చివర్లో హీరోయిన్  చేసిన కామెంట్స్ మాత్రం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి  అందరికీ థాంక్స్ చెప్పిన తర్వాత ఎవరైనా ప్రశ్నలు అడుగుతారేమో అని వెయిట్ చేసింది హీరోయిన్. కానీ ఎవరు ప్రశ్నలు అడగలేదు. ఆ తర్వాత చాందిని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎప్పుడైనా మెయిల్ యాక్టర్స్ హీరోలు డైరెక్టర్లకు మాత్రమే ప్రశ్నలు ఉంటాయి. హీరోయిన్స్ కి ఎలాంటి ప్రశ్నలు ఉండవు. ఎన్నో ప్రశ్నల నుంచి చూసుకుంటూ వస్తున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది చాందిని చౌదరి. అయితే ఈ ప్రెస్ మీట్ మొత్తంలో నీ కామెంట్స్ తప్పకుండా హైలెట్ అవుతాయి అంటూ విశ్వక్సేన్ కామెంట్ చేయడం గమనార్హం. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్ సైతం ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ చిన్న హీరోయిన్ అయినా చాందిని మాత్రం ధైర్యంగా ఈ విషయాన్ని బయటకు చెప్పింది అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: