దెయ్యం పాత్రలో కనిపించబోతున్న అనుష్క శెట్టి..!!
కథ ఏంటంటే.. కథనర్ అంటే 9వ శతాబ్దానికి చెందిన కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడు, యోధుడి కథ అంటున్నారు. ఇతని హయాంలోనే కల్లియన్ కట్టు నీలి అనే యువతి ఉండేది. ఈ పాత్రలోనే అనుష్క చూడబోతున్నాం అంటున్నారు. ఆమె అందం గురించి ట్రావెన్ కోర్ జానపదాల్లో ఎన్నో కథలు, పాటలు ఉన్నాయి. అసలు నీలి ప్రస్తావన లేకుండా పాటలు కూడా పాడరు అంట. అలాగే కల్లియన్ కట్టు నీలికి సంబంధించి బోలెడు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అలాగే నీలి పాత్రకు సంబంధించి కేరళ సాహిత్యంలో ఎన్నో ఆధారాలు, మరెంతో కంటెంట్ కూడా ఉంది. వింటే గూస్ బంప్స్ తెప్పించే ఎన్నో సంఘటనలు, మలుపులు ఉంటాయి. వాటి ఆధారంగానే డైరెక్టర్ రోజిన్ థామస్ ఈ కథనర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఈ నీలి ఒక దేవదాసి కుమార్తె అంట. అయితే ఆమె కుటుంబంలో జరిగిన అనుకోని సంఘటనలు, ఆమెపై జరిగిన చేతబడుల కారణంగా నీలి ఆత్మ మారుతుంది అని చెప్తున్నారు. ఇక్కడే ఒక మంచి సినిమాకి కావాల్సిన స్కోప్ కూడా ఉంటుంది. పైగా నీలికి కడమత్తుకు ఉన్న సంబంధం ఏంటి అనే పాయింట్ ని కూడా బాగా హైలెట్ చేయచ్చు. ఇక్కడ ఇంకో పుకారు కూడా వినిపిస్తోంది. అదేంటంటే.. కథనర్ మొత్తం రెండు పార్టులుగా రాబోతోంది అంటున్నారు. మొదటి పార్టులో కావాల్సినన్ని ట్విస్టులు, మలుపులు, వెన్నులో వణుకుపుట్టే సంఘటనలు ఉంటాయి అంటున్నారు. ఇంక రెండో పార్ట్ అయితే అంతకు మించే ఉంటుందంట. ఈ నీలి పాత్ర చూస్తే అరుంధతికి మించే ఉంటుంది అంటున్నారు. ఇదంతా అధికారిక సమాచారం కాకపోయినా.. చిత్ర బృందం నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం. మరి.. దెయ్యం పాత్రలో అనుష్క కనిపించబోతోంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.