
యంగ్ హీరో సెంటిమెంట్ తో కన్ఫ్యూజ్ అవుతున్న మీడియా !
అతడి పూర్తి పేరు సాయి ధరమ్ తేజ్ అయినప్పటికీ ఒక జ్యోతిష్కుడు ఇచ్చిన సలహాతో కొంతకాలం క్రితం అతడి పేరును సాయి తేజ్ గా మార్చుకుని ధరమ్ పదాన్ని వదులుకున్నాడు. ఆతరువాత అతడికి చాలపెద్ద యాక్సిడెంట్ జరగడం దాని నుండి బయటపడటానికి చాలకాలం పట్టింది. యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత నటించిన ‘విరూపాక్ష’ ‘బ్రో’ సక్సస్ అయినప్పటికీ అతడికి చెప్పుకోతగ్గ స్థాయిలో భారీ నిర్మాణ సంస్థలు టాప్ డైరెక్టర్స్ నుండి అవకాశాలు రావడంలేదు.
ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘గాంజా శంకర్’ ఆగిపోయింది అని అంటున్నారు. ఇక అతడి ప్రియమిత్రుడు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో ‘సత్య’ మూవీలో నటిస్తున్నారు. మరికొన్ని సినిమాల కథలు వింటున్నాను అని తేజ్ చెపుతున్నప్పటికీ వాటిపై క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య లేటెస్ట్ గా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈయంగ్ హీరో తన పేరును మళ్ళీ మార్చుకుని సాయి దుర్గా తేజ్ అంటూ తన తల్లి పేరును తన పేరులో యాడ్ చేసుకున్నాడు.
దీనితో ఇప్పుడు ఈయంగ్ హీరోకి సంబంధించిన వార్తలు వ్రాసే మీడియా వర్గాలు సాయి ధరమ్ తేజ్ అనాలా లేదంటే సాయి తేజ్ అనాల ఇప్పుడు లేటెస్ట్ గా మార్చుకున్న పేరుతో సాయి దుర్గా తేజ్ అంటూ వార్తలు వ్రాయాలా అన్నవిషయం తెలియక మీడియా వర్గాలు కన్ఫ్యూజ్ అవుతాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి పేరు మార్చుకోవడంతో అయినా తేజ్ కెరియర్ ఉన్నత స్థాయికి చేరుకుని టాప్ మీడియం రేంజ్ హీరో అవుతాడో లేదో చూడాలి..