అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి బంపర్ ఆఫర్ ని.. ఆ హీరో మిస్ చేసుకున్నాడా?

praveen
ప్రతి బియ్యపు గింజ మీద తినే వాడికి పేరు రాసి ఉంటుంది అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సామెత అప్పుడప్పుడు సరిగ్గా సరిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక ఏ కథ ఎవరు చేయాలి అనే విషయంపై ముందే రాసి ఉంటుంది అన్నట్లుగా కొన్ని కొన్ని సార్లు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఒక హీరో దగ్గరికి వెళ్లి ఇక అతను కథ నచ్చలేదనో లేదంటే ఇంకా ఏదైనా కారణంతోనో రిజెక్ట్ చేసిన సినిమాని ఇక మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.

 ఇప్పుడు వరకు ఇండస్ట్రీలో ఇలాంటివి చాలాసార్లే జరిగాయి అని చెప్పాలి. అయితే ఇక రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందట. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే అటు రవితేజ కెరీర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది ఈ మూవీ. అయితే ఈ మూవీ ని పూరి జగన్నాథ్ ముందుగా రవితేజతో తీయాలని అనుకోలేదట  ఏకంగా హీరో శ్రీరామ్ తో తీయాలని అనుకున్నాడట. అయితే తమిళంలో అతని కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే అతనికి అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చిందట. రైటర్ కోన వెంకట్ ఈ సినిమా కథను ముందుగా శ్రీరామ్ కు చెప్పాడట.

 కానీ అప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న శ్రీరామ్ చివరికి ఇక ఈ కథను రిజెక్ట్ చేశాడట. దీంతో ఇక కోన వెంకట్ ఇక ఈ సినిమా కథను రవితేజకు చెప్పడం.. రవితేజ ఓకే చేయడం ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడం జరిగింది. అయితే కేవలం ఈ ఒక్క మూవీ విషయంలోనే కాదు తమిళ్ తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయిన బిచ్చగాడు సినిమా ఆఫర్ కూడా ముందుగా శ్రీరామ్ కే వచ్చిందట. కానీ సినిమా చేస్తే తన కెరీర్ ఎక్కడ పాడవుతుందో అని చివరికి రిజెక్ట్ చేశాడట. ఇక ఈ మూవీ కూడా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు సినిమాలు చేసి ఉంటే శ్రీరామ్ కెరియర్ మరోలా ఉండేది అని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: