చీరకట్టులో క్యూట్ స్మైల్ తో మెరిసిపోతున్న అనసూయ. !

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఈ బ్యూటీ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే ఈ షో తో ఎంతో మంది బుల్లి తెర అభిమానులను మనసును కూడా దోచుకుంది. ఇక ఆ తర్వాత ఈమె సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే చాలా సినిమాలలో నటించింది.
 

అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను సాధించడం ... అలాగే అందులో ఈమె తన నటనతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఈమెకు వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం ఈమె పుష్ప అనే పాన్ ఇండియా సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ కావడంతో ఈ నటికి కూడా దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

ఈ బ్యూటీ ఎక్కువ శాతం తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉండగా అప్పుడప్పుడు మాత్రం క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో డీసెంట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: