మంజుమ్మేల్ బాయ్స్ రికార్డులు ఆగట్లేదుగా?

Purushottham Vinay
మలయాళ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన భ్రమ యుగం సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ అనుకున్నంత వసూళ్లు రాకపోయినా చాలా మంచి పేరు  వచ్చింది. ఇక ప్రేమలు సినిమాని మార్చి 8వ తేదీన తెలుగులో విడుదల చేస్తున్నారు.ఇంకా అలాగే ఫిబ్రవరి 22వ తేదీన మలయాళం లో విడుదల అయ్యి ఫాస్టెస్ట్ 100 క్రోర్ గ్రాసింగ్ మలయాళ సినిమాగా నిలిచిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమాని కూడా తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మూవీని కొని డబ్బింగ్ చేయించి రిలీజ్ చేసేందుకు తెలుగులో కొన్ని పెద్ద బ్యానర్లు ప్రయత్నించాయి. కానీ సినిమా యూనిట్ మాత్రం ఒక ఆసక్తికరమైన నిర్ణయంని తీసుకుంది. ఇక అదేమిటంటే డబ్బింగ్ హక్కులు ఎవరికి ఇవ్వకుండా తామే డబ్బింగ్ చేయించి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ కి చెందిన మైత్రి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మార్చి 15వ తేదీన మూవీని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.


ఒకరకంగా ఇది తెలుగులో పెద్ద బ్యానర్లకు పెద్ద షాక్ అని చెప్పాలి.  చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమా 11 మంది స్నేహితుల చుట్టూ తిరిగే ఓ సర్వైవల్ థ్రిల్లర్. 2006లో తమిళనాడు కొడైకెనాల్ లో ఉన్న గుణ సినిమాల్లో చూపించిన గుహల్లో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కేరళ కొచ్చి లోని మంజుమ్మేల్ కి చెందిన 11 మంది స్నేహితులు 2006లో తమిళనాడు కొడైకెనాల్ లో ఉన్న గుణ కేవ్స్ కు పర్యటకులుగా వెళతారు.అందులో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ఓ లోతైన గుంతలోకి జారి పడిపోతాడు. తరువాత అతన్ని రక్షించడానికి మిగిలిన స్నేహితులు ఏం చేశారన్నదే ఈ మంజుమ్మెల్ బాయ్స్ స్టోరీ.ఈ సినిమా తమిళనాడులో ఏకంగా 20 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఖచ్చితంగా 40 నుంచి 50 కోట్ల దాకా వసూళ్లు రాబట్టడం పక్కా అని సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా తమిళనాడులో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికి కూడా హౌస్ ఫుల్ వసూళ్లతో ఈ సినిమా అక్కడ దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: