గామికి రికార్డ్ ఓపెనింగ్స్ పక్కా?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విద్యాధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై అంచనాలు చాలా గట్టిగానే ఉన్నాయి.ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన గామి సినిమా ఆ తర్వాత టీజర్ ట్రైలర్ తో కూడా ఎక్కువ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకుంది. ప్రమోషనల్ కంటెంట్ తోనే ఈ సినిమా జనాల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది.తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే విధంగా ప్రమోషన్స్  చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ఈమధ్య ఫినిష్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీలో కొన్ని లోతైన సన్నివేశాలను ఎంతో అర్థవంతంగా ప్రజెంట్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చింది.ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు A సర్టిఫికెట్ వస్తుంది అని ఎవరు ఊహించలేదు. కానీ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అందుకే దీనికి ఏ సర్టిఫికెట్ వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొత్తం 2 గంటల 26 నిమిషాలు నిడివి తో వెండితెరపై కొనసాగబోతుంది.


ఫస్ట్ ఆఫ్ లోనే స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఎంతో ఆకట్టుకునే విధంగా సన్నివేశాలను డిజైన్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది.ఇక మూవీ సెకండ్ హాఫ్ పై మరింత అంచనాలను పెంచే విధంగా ఆ సీన్స్ ఉంటాయట. విశ్వక్ సేన్ ఈ మూవీలో అఘోరా పాత్రలో కనిపించనున్నాడు. మనిషి స్పర్శ తగిలితేనే తట్టుకోలేని అతను ఆ సమస్య నుంచి బయటపడడానికి హిమాలయాలకు ప్రయాణం సాగిస్తాడు. ఇంకా అతనితో పాటు హీరోయిన్ చాందిని చౌదరి కూడా వెళుతుంది. ఈ క్రమంలో అతను ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అతనికి చివరికి ఎటువంటి సమాధానం దొరికింది అనే అంశాలు సినిమాలో ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.సినిమాలో ముఖ్యంగా విజువల్స్ కూడా హైలెట్ కాబోత్బున్నాయి.ఇక మొత్తానికి సినిమా కంటెంట్ మాత్రం బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు చూడని విధంగా ఉంటుందని అర్థమవుతుంది. ఇక ఈ మూవీలోని నటీనటులు కూడా వారి పాత్రలకు తగ్గట్టుగా క్యారెక్టర్స్ లో ఒదిగిపోయినటించారని చెబుతున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే విధంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: