మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో హిందీ, తెలుగు భాషలలో తెరకెక్కిన సినిమా ఆపరేషన్ వాలంటైన్. పుల్వామా ఘటన తర్వాత పాకిస్థాన్ పై ఇండియా జరిపిన ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. మార్చి 1న థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీకి డే 1 నుంచే దారుణమైన మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్ బాగున్నాయని, అయితే సినిమాలో మెజారిటీ హీరో, హీరోయిన్స్ మాత్రమే కనిపిస్తారనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వినిపించింది. అందువల్ల మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ని ఆపరేషన్ వాలంటైన్ సొంతం చేసుకోలేకపోయింది. శని, ఆది వారాల్లో కూడా ఆశించిన స్థాయిలోఈ సినిమాకి కలెక్షన్స్ రాలేదు. రెండో రోజు ఈ సినిమా 72 లక్షల దాకా షేర్ అందుకుంది.
ఆదివారం నాడు మళ్ళీ డ్రాప్ అయ్యి 58 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 5.45 కోట్ల గ్రాస్ ని మాత్రమే ఆపరేషన్ వాలంటైన్ కలెక్ట్ చేయగా అందులో 2.80 కోట్ల షేర్ మాత్రమే ఉంది. సోమవారం, మంగళవారం రోజుల్లో అయితే దారుణంగా వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. ఈ సినిమా వసూళ్లు చాలా ఏరియాల్లో దారుణంగా డ్రాప్ అయ్యాయి.ఈ సినిమా థీయాట్రికల్ రైట్స్ మొత్తం 17 కోట్లకి అమ్ముడయ్యాయి. ఇంకా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా 15 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ మూవీకి దారుణమైన వసూళ్లు వచ్చాయాంటే వర్కింగ్ డేస్ లో మరింత డ్రాప్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఏ విధంగా చూసుకున్న కలెక్షన్స్ పరంగా పుంజుకునే అవకాశం లేదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో హ్యాట్రిక్ డిజాస్టర్ ని వరుణ్ తేజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వరుణ్ తేజ్ ఆశలన్నీ కూడా తన తరువాత సినిమా మట్కా పైనే ఉన్నాయి. మరి ఈ సినిమా అయినా వరుణ్ ని బ్రతికిస్తుందో లేదో చూడాలి.