ఆర్టికల్ 370: నిర్మాతలకు రెండింతల లాభాలు?

Purushottham Vinay
2019 వ సంవత్సరంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా ఏళ్లుగా జమ్మూ కశ్మీర్‌ను దేశం నుంచి వేరు చేస్తోన్న ఆర్టికల్ 370ని ఎంతో సాహోసోపేతంగా 2019 ఆగష్టు 5న పార్లమెంటులో ప్రవేశిపెట్టి తొలిగించడం జరిగింది.ఇంకా అంతేకాదు జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని.. జమ్ము కశ్మీర్‌గా, లద్దాక్‌గా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసింది. పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత 31 అక్టోబర్ 2019న సర్ధార్ పటేల్ జయంతి నాడు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చింది. అప్పటి దాకా ఎప్పుడు ఏదో ఒక గొడవతో సతమతమయ్యే అక్కడ ప్రాంత ప్రజలు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి ప్రజల్లో ఎన్నో మార్పులు వచ్చాయి.'యూరీ .. ది సర్జికల్ స్ట్రైక్' మూవీ డైరెక్ట్ చేసిన ఆదిత్య ధర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈయనతో పాటు లోకేష్ ధర్, జ్యోతి దేశ్‌పాండే ఈ సినిమా అసిస్టెంట్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. ఆదిత్య జంబాలే ఈ మూవీని డైరెక్ట్ చేసారు.

 ఆర్టికల్‌ 370 మూవీలో యామీ గౌతమ్ ఇంకా ప్రియమణితో పాటు అరుణ్ గోవిల్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 23న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 50 కోట్ల పైగా నెట్ వసూళ్లను సాధించింది. అసలు ఎటువంటి స్టార్స్ లేకుండా.. కంటెంట్‌ను నమ్ముకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికి ఎక్కువ వసూళ్లు రాబడుతూ భారీ లాభాలు తెచ్చిపెడుతుంది.ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు జమ్మూ కశ్మీర్‌లో చేస్తోన్న అభివృద్దిని చూస్తూ పక్కనే ఉన్న పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా POJKను మన దేశంలో విలీనం చేయాలంటూ ఉద్యమాలు చేసిన సంగతి తెలిసిందే.  అప్పట్లో ఆర్టికల్ 370 పార్లమెంటులో బిల్లు పెట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో తీసుకున్న చర్యలు నేపథ్యంలో ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అపుడు భద్రతా దళాలు ఎటువంటి చర్యలు తీసుకున్నాయనే కాన్సెప్ట్‌తో ఆర్టికల 370 సినిమా తెరకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: