రామ్ చరణ్ ను ఇన్సల్ట్ చేసి.. ఇప్పుడు మళ్లీ కవర్ చేసే ప్రయత్నాలా?

praveen
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో తన నటనతో అదరగొట్టేస్తూ ఉంటాడు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బడా స్టార్లకు సైతం సాధ్యం కాని స్టార్ డమ్ సంపాదించాడు రామ్ చరణ్  అలాంటి రామ్ చరణ్ ను ఇటీవల బాలీవుడ్ హీరోలు  అవమానించడాన్ని అటు అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి.

 ఇటీవలే రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ముఖేష్ అంబానీ కొడుకైన అనంత్ అంబానీ ఫ్రీ వెయిటింగ్ వేడుకలకు హాజరయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే ఇక్కడ ఒక ఈవెంట్ నిర్వహించగా షారుక్ ఖాన్ రామ్ చరణ్ ను స్టేజ్ మీదకి పిలవడానికి ఇడ్లీ వడ అంటూ వ్యాఖ్యానించడం మెగా ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో బాలీవుడ్ లో త్రీ ఖాన్స్ గా పిలుచుకునే షారుక్,అమీర్, సల్మాన్లు రామచరణ్ తో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేశారు.

 అయితే ఇలా డాన్స్ చేయడానికి ముందు చరన్ ని స్టేజి మీదకి పిలవడానికి ఇడ్లీ వడ అంటూ సంబోధించాడు షారుక్ ఖాన్. అయితే మొదటి నుంచి బాలీవుడ్ హీరోలకి సౌత్ ఇండస్ట్రీ అన్న సౌత్ హీరోలన్న కాస్త చిన్నచూపు. అందుకే ఎప్పుడూ ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో సౌత్ హీరోలు బాలీవుడ్ హీరోలను మించి క్రేజ్ సంపాదించుకున్నారూ. దీంతో అసలు ఓర్వలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రీ వెడ్డింగ్ వేడుకలో రామ్ చరణ్ స్టేజి మీదకి పిలవడానికి ఇడ్లీ సాంబార్ గాయ్ కం హియర్ అంటూ పిలిచాడు షారుక్. అయితే ఇక ఇలా చరణ్ ను అవమానించడం జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. అయితే షారుక్ చేసిన కామెంట్స్ ని ఆయన ఫ్యాన్స్ సమర్ధించుకుంటున్నారు. వన్ టూ కా ఫోర్  సినిమాలోని డైలాగ్ గుర్తు చేస్తూ.. షారుక్ చరణ్ ని అవమానించలేదు.. ఏకంగా రజనీకాంత్ తో పోల్చాడు అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: