చిరంజీవి విశ్వంభర చిత్రంలో విలన్ అతడేనా..?
అయితే అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర చిత్రంలో రావు రమేష్ విలన్ గా నటించబోతున్నారు.. అయితే మొదట హిందీ నటుడు కోసం సంప్రదించక ఆ పాత్రకు సరిపోయే వారు దొరకకపోవడంతో రావు రమేష్ ని తీసుకోబోతున్నట్లు సమాచారం.. రావు రమేష్ ఇలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటారు ముఖ్యంగా చిరంజీవితో సమానంగా నటించగలిగిన నటుడని చెప్పవచ్చు.. హీరోయిన్గా త్రిష నటిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో చిరంజీవి దొరబాబు అనే పేరుతో నటించబోతున్నారట. చిరంజీవి చెల్లెలుగా ఇషా చావ్ల చాల కీలకమైన పాత్రలో నటించబోతోందట. ఈమెతో పాటు రమ్య పసుపులేటి కూడా ఈ సోషియో ఫాంటసీ వెంచర్లు కనిపించబోతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో చిరంజీవితో కలిసి దిగిన ఒక ఫోటోను కూడా షేర్ చేసింది. వీరితో పాటు ప్రముఖ నటీనటులు సైతం కీలకమైన పాత్రలు నటిస్తున్నారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. విశ్వంభర చిత్రానికి సంబంధించి అఫీషియల్ గా చిత్ర బృందం ఎలాంటి క్లారిటీలు ఇస్తాయో చూడాలి మరి..