
ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న మాధవన్..??
మాధవన్ మాట్లాడుతూ..” నేను అందరి ముందు ఈ నిజాన్ని ఒప్పుకోవాలనుకుంటున్నాను. ఖయామత్ సే ఖయామత్ చేసి జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అప్పట్లో ఆమెను పెళ్లి చేసుకోవడమే నా ఏకైక లక్ష్యం. ఇదే విషయాన్ని మా అమ్మతో కూడా చెప్పాను” అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తన జూహీతో కలిసి చేసే అవకాశమే రాలేదని అన్నారు. హిందీలో మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఖయామత్ సే ఖయామత్ తక్ మూవీలో అమీర్ ఖాన్, జూహీ కలిసి నటించారు. 1988లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టిన కూడా ఇదే. ఈ తోనే ఉత్తమ నటి తెరంగేట్రం అవార్డు సహా ఎనిమిది ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది.ఖయామత్ సే ఖయామత్ తక్ విడుదలైనప్పుడు మాధవన్ ఇంకా నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. సఖి తో హీరోగా వెండితెరకు పరిచయమైన మాధవన్.. ఆ తర్వాత తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. 2001లో రెహానా హై టెర్రే దిల్ మేతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. గతేడాది వచ్చిన రాకెట్రీ తో దర్శకుడిగా మారారు మాధవన్.