"కిక్" రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ హీరో గా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమా 2009 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను కూడా రాబట్టింది . ఇక పోతే ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు . ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్ర ను పోషించింది.
 

ఇకపోతే ఈ మూవీ సురేందర్ రెడ్డి కి దర్శకుడు గా అద్భుతమైన గుర్తింపును తీసుకు వచ్చింది. ఇలా ఆ సమయం లో ఆ మంచి విజయం సాధించిన ఈ సినిమాను మార్చి 1 వ తేదీన మళ్లీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ సమయం దగ్గర పడడం తో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క రీ రిలీజ్ టికెట్ బుకింగ్ లను ఓపెన్ చేశారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు . మరి ఇప్పటి వరకు రవితేజ కెరియర్ లో మంచి విజయం సాధించిన వెంకీ సినిమా రీ రిలీస్ అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది . మరి కిక్ మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt

సంబంధిత వార్తలు: