హిందీ కాలింగ్ బెల్ కు సీక్వెల్ గా వస్తున్న హార్రర్ మూవీ రాక్షసి..!!
కాలింగ్ బెల్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించిందే ఈ రాక్షసి మూవీ. ఇందులో బ్యూటిఫుల్ హీరోయిన్ పూర్ణ ఇద్దరు పిల్లల తల్లిగా లీడ్ రోల్ చేసింది. ఓ ఇంట్లోకి పిల్లలతో దిగిన పూర్ణ తనకు ఎదురైన అనుభవాల గురించి ఓ స్వామిజీకి చెబుతుంది. అప్పుడు స్వామిజీ చెప్పిన నిజాలు విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది. ఇంట్లో ఉన్న దెయ్యానికి వీళ్లు బలి అయ్యారా. అయితే కాలింగ్ బెల్ మూవీకి దీన్ని ఎలా లింక్ చేశారనేది సినిమాలోనే చూడాలి. మరి హారర్ కాకుండా టైమ్ పాస్‌గా సినిమాను చూడొచ్చ..
యూట్యూబ్‌లో హిందీ డబ్బ్‌డ్ వెర్షన్ మూవీ ఎల్ 7కి 40 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంతగా హిట్ అయిందో. దాదాపుగా హరర్ సినిమాల్లో రొటీన్‌గా ఉండే కథతోనే ఈ సినిమా స్టోరీ ఉంటుంది. కొత్తగా ఓ ఇంట్లోకి దిగిన ఓ జంటకు ఎదురైన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే, ఒంటరిగా అమ్మాయి ఉన్నప్పుడు మాత్రమే దెయ్యం భయపెడుతుంది. అలా ఎందుకు జరుగుతుంది. అసలు కారణాలు ఏంటీ అనేదే సినిమా కథ. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.నలుగురు ఫ్రెండ్స్ సరదాగా గడుపుతుంటారు. అక్కడ ఎంతోమంది చాలా రకాలుగా చెప్పుకునే ఓ పాత భవనంలోకి సరదాగా వెళ్తారు ఆ ఫ్రెండ్స్. అనంతరం అక్కడి నుంచి వచ్చేవాళ్లకు ఓ నెక్లెస్ దొరుకుతుంది. ఆ తర్వాత ఆ స్నేహితుల మధ్య ఏం జరిగింది, వారు ఎలాంటి సంఘటనలు ఫేస్ చేశారు అనేదే సినిమా కథ. ఊహించని ట్విస్టులతో మంచి హారర్ ఎఫెక్ట్‌తో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది. దీనికి సీక్వెల్‌గా డిమోంటీ కాలనీ 2 కూడా రాబోతుంది.