టిల్లు స్క్వేర్ లో ఆ హాట్ బ్యూటీ..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కొంత కాలం క్రితం విడుదల సూపర్ సక్సెస్ ను అందుకున్న డీజే టిల్లు మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. ఇకపోతే డీజే టిల్లు మూవీ లో సిద్దు కి జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నేహా శెట్టి నటించగా ... ఈ సినిమాలో ఈమె రాధిక అనే పాత్రలో నటించింది. రాధిక అనే పాత్రలో నేహా తన అద్భుతమైన నటనతో , అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఇకపోతే ఈ సినిమా విజయంలో సిద్దు పాత్ర ఎంత కీలక పాత్రను పోషించిందో ... నేహ పాత్ర కూడా అదే స్థాయి పాత్రను పోషించింది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఇకపోతే ప్రస్తుతం రూపొందుతున్న టిల్లు స్క్వేర్ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... డిజె టిల్లు మూవీ లో రాధిక పాత్రలో నటించి సిద్ధూ ను ముప్పు తిప్పలు పెట్టిన నేహా "టిల్లు స్క్వేర్" మూవీ లో కూడా కనిపించబోతున్నట్లు ... ఈ ముద్దు గుమ్మ పాత్ర నిడివి ఈ సినిమాలో చాలా తక్కువ గానే ఉంటుందట కానీ ఈ సినిమా కథ మొత్తని కూడా ఈ బ్యూటీనే మలుపు తిప్పబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక వేళ ఈ వార్త కనక నిజం అయినట్లు అయితే ఈ సినిమాకు రాధిక పాత్ర మరింత ప్లేస్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: