మెగాస్టార్
చిరంజీవి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
చిరంజీవి ఎవరైనా
ఇండస్ట్రీ నుండి సహాయం కోసం వస్తే తనకు వీలు దొరికినప్పుడు తనవంతు సహాయాన్ని చేస్తూ ఉంటాడు. అలాగే ఏవైనా
సినిమా టీజర్ లు , ట్రైలర్ లు , పాటలను విడుదల చేయాలి అన్న కూడా ఆయన చిన్న వారు , పెద్ద వారు అని చూడకుండా సినిమాకు సపోర్ట్ చేస్తూ ఆ వీడియోలను కూడా విడుదల చేస్తూ ఉంటాడు. అలాగే ఏదైనా
సినిమా బృందం వారు ఆ
మూవీ ప్రమోషన్ లలో భాగంగా నిర్వహించే
ఈవెంట్ లకి ముఖ్య అతిథిగా పిలిచినా కూడా పెద్దగా ఆలోచించకుండా ఏదో ఒక సమయాన్ని వీలు చేసుకుని దానికి అటెండ్ అవుతూ ఉంటాడు.
ఇక ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ లో భాగంగా
చిరంజీవి మాట్లాడుతూ ... పుల్వామాలో
జవాన్ లపై దాడికి ప్రతీకారంగా మన దేశం చేసిన ఎటాక్ నేపథ్యంలో ఆపరేషన్
వాలెంటైన్ సినిమాని రూపొందించారు. ఇంత గొప్ప దేశభక్తి సినిమాని ఖచ్చితంగా యూత్ అంతా చూడాలి అని
చిరంజీవి చెప్పుకొచ్చాడు.
చిరంజీవి ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ లో బాగంగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.