తెలుగోడివేన అంటూ మీమర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సందీప్ కిషన్ ..!!
ఈ క్రమంలోనే తాజాగా ఇన్ఫ్లుయెన్సర్ మీట్ నిర్వహించింది ఊరు పేరు భైరవకోన టీం. ఇందులో మీమర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అదే సమయంలో ఓ మీమర్ అడిగిన ప్రశ్నలకు సందీప్ ఫైర్ అయ్యాడు. సరదాగా మాట్లాడుతూనే అతడికి క్లాస్ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో ఏముందంటే.. 'మీరు హీరోయిన్ తో అలా చేశారు కదా.. మీరు ఎలా చేశారని నాకు క్యూరియాసిటిగా ఉంది ' అంటూ స్టార్ట్ చేశాడు ఓ మీమర్. అయితే మొదటి ప్రశ్నకు సందీప్ ఆన్సర్ ఇవ్వనన్నాడు. దీంతో ఆ మీమర్ మరో క్వశ్చన్ అడిగాడు. 'మీరు ఇద్దరి హీరోయిన్లతో చేశారు కదా.. ఎవరితో బాగా అనిపించింది' అంటూ ప్రశ్నించాడు.
దీంతో సందీప్ రియాక్ట్ అఏవుతూ.. 'నీ మాతృభాష తెలుగే కదా.. ఆ హీరోయిన్స్ తో చేశారు అనడం కంటే.. తెలుగులో నటించడం అనే పదం ఉంటుంది.ఆ హీరోయిన్లతో నటించారు అనడం కరెక్ట్ అని నీకు తెలియదా ' అంటూ క్లాస్ తీసుకుంటూనే.. ఇద్దరి హీరోయిన్లతో నటించడం బాగుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ వైరలవుతుండగా.. సందీప్ కు మద్దతు తెలుపుతున్నారు నెటిజన్స్.