మలయాళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి జోజు జార్జ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కొంత కాలం క్రితం పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా శ్రీ లీలా హీరోయిన్ గా రూపొందినటువంటి ఆది కేశవ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించిన జోజు జార్జ్ మాత్రం తన నటనతో , అద్భుతమైన విలనిజంతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు.
ఇకపోతే ఈ నటుడు కొంత కాలం క్రితమే మలయాళం లో రూపొందిన ఆంటోనీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ మలయాళం లో పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలోనే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ అక్కడ అద్భుతమైన విజయం సాధించింది. ఇలా అక్కడ అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా తాజాగా నేరుగా తెలుగు వర్షన్ లో "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ "ఓ టి టి" హక్కులను ఆహా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సంస్థ వారు ఈ సినిమాను తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే మలయాళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కళ్యాణి ప్రియదర్శిని ఓ కీలకమైన పాత్రలో నటించగా ... చెంబన్ వినోద్ జోస్ , నైలా ఉష , ఆశా శరత్ , అప్పని శరత్ , విజయరాఘవన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి జోషి దర్శకత్వం వహించాడు.