కమల్ 'భారతీయుడు-2' సినిమా.. విడుదలయ్యేది అప్పుడేనట?

praveen
ఒకప్పుడు భారీ అంచనాల మధ్య వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన సినిమా భారతీయుడు. ఏకంగా లంచం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఇక ఎంతోమందిలో మార్పును కూడా తీసుకువచ్చింది అని చెప్పాలి. శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ టీవీలో వచ్చిన కూడా ప్రేక్షకులు అన్ని పనులను పక్కన పెట్టేసి సినిమా చూస్తూ ఉంటారు. అంతలా ప్రభావితం చేస్తుంది. అయితే ఇక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీక్వల్ పై కూడా ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ ఎప్పుడేప్పుడు విడుదలవుతుందో అని అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ఇక ఎన్నో రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఇక మధ్య మధ్యలో కొన్ని కారణాలవల్ల చివరికి సినిమా షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. అంతలోనే ఏకంగా శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్  అనే సినిమాతో బిజీ కావడంతో ఇక భారతీయుడు 2 సినిమా షూటింగ్ కొన్నాళ్లపాటు ఆగిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఇక ఈ సినిమా ఎప్పుడు రాబోతుంది అనే విషయంపై మాత్రం అభిమానులు అందరిలో కూడా ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే షూటింగ్ ను ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న భారతీయుడు సీక్వెల్ సినిమా ఇక ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది అన్నది సమాచారం.

 అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని.. సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే శంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అటు లోకనాయకుడు కమల్ హాసన్ తో పాటు భారీ తారాగణం కూడా ఉంది.రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ఎస్ జె సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక కాజల్ అగర్వాల్ అటు కమల్ హాసన్ కు భార్య పాత్రలో నటిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: