ఇండస్ట్రీలో అమ్మాయిలు దానికి ఒప్పుకునేది అందుకే.. నటి సత్య వ్యాఖ్యలు..??

murali krishna
దాదాపు 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో నటిగా రాణిస్తున్నారు సత్య కృష్ణన్. ఆనంద్ చిత్రంతో సత్య కృష్ణన్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత బొమ్మరిల్లు, మెంటల్ కృష్ణ లాంటి చిత్రాల్లో నటించిందిదాదాపు 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో నటిగా రాణిస్తున్నారు సత్య కృష్ణన్. ఆనంద్ చిత్రంతో సత్య కృష్ణన్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత బొమ్మరిల్లు, మెంటల్ కృష్ణ లాంటి చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోల చిత్రాల్లో సత్య కృష్ణన్ అక్క, వదిన తరహా పాత్రలు చేసింది. కానీ ఆనంద్ చిత్రంలో వచ్చిన గుర్తింపు మరే చిత్రంలో రాలేదని సత్య కృష్ణన్ అంటున్నారు.
అయితే తాజాగా సత్య కృష్ణన్ కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చాలా మంది కాస్టింగ్ కౌచ్ విషయంలో అమ్మాయిలకు మద్దతుగా నిలుస్తుంటారు. కానీ సత్య మాత్రం ఇండస్ట్రీలో అమ్మాయిలు పరిస్థితులని అర్థం చేసుకుని ఇలాంటి ఒడిదుడుకులని అధికమించాలని అంటున్నారు.సముద్రం అన్నాక ఉప్పు ఉంటుంది.. నీరు కూడా ఉంటాయి. మనం ఎలా ఉండాలి అనేది మన నిర్ణయం అని సత్య కృష్ణన్ అన్నారు. తాను మాత్రం ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్నట్లు తెలిపారు. తాను పుట్టి పెరిగింది మొత్తం తెలంగాణ లోనే. కానీ అమ్మా నాన్న మాత్రం గుంటూరు వారు. ఇద్దరూ బ్యాంక్ ఎంప్లాయీస్ అని తెలిపింది.
 తాను హోటల్ మేనేజ్ మెంట్ చేశానని.. సినిమా రంగం పై ఎలాంటి అవగాహన లేదని పేర్కొంది. ఒకసారి ఆడిషన్స్ కి వెళితే సెలెక్ట్ అయిపోయా. ఆ విధంగా సినిమా ఛాన్స్ వచ్చింది అని తెలిపారు. ఇండస్ట్రీలో తనకి ఎలాంటి కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురు కాలేదని సత్య అన్నారు. నన్ను అందరూ చాలా గౌరవిస్తారు. ఎందుకంటే నేను వర్క్ నే ప్రేమిస్తాను కాబట్టి అని సత్య తెలిపింది.కాస్టింగ్ కౌచ్ గురించి సత్య మాట్లాడుతూ.. ఇండస్ట్రీ గురించి ప్రస్తావన వస్తే ఇక్కడ ఆడవాళ్ళని వాడేసుకుంటారు అని చెబుతుంటారు. ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే సంఘటనలు ఏ ఇండస్ట్రీలో జరగడం లేదు ? కేవలం సినిమా పరిశ్రమలోనే జరుగుతున్నాయా ? అని ప్రశ్నించారు. సముద్రంలో ఉప్పు నీరు రెండూ ఉంటాయి. అమ్మాయిలు తాము ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి.ఇండస్ట్రీలో కొంతమంది క్యారెక్టర్ లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మన లైన్ లోకి వాళ్ళని రానివ్వకుంటే సరిపోతుంది. కొంతమంది అమ్మాయిలు ముందే భయపడి అది ఇవ్వకపోతే క్యారెక్టర్స్ ఇవ్వరేమోనని కమిటై పోతుంటారు. ఇండస్ట్రీ తప్ప వేరే మార్గం లేదు అనుకోవడం మానాలి. అప్పుడే ఇలాంటి వాటిని అధికమించగలం అని సత్య అన్నారు. కానీ చెప్పడం సులభం.. చాలా మంది అమ్మాయిలకు వాళ్లకి ఉండే సమస్యలు వాళ్ళకి ఉంటాయి. అందువల్ల కాస్టింగ్ కౌచ్ కి కమిటైపోతుంటారు అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: