ఆ ఇద్దరు డైరెక్టర్స్ అంటే ఇస్తామంటున్న స్టైలిష్ స్టార్....!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టైలిష్ స్టార్ గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకున్న అల్లు అర్జు న్ప్రస్తుతం వరు గా సినిమాలకి కమిట్ అవుతున్నాడు.ఇక ఇప్పటికే ఆయన సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే తన మార్కెట్ భారీగా పెరుగుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి ఇష్టమైన దర్శకులు,ఎవరో తెలుసు కోవడానికి ఆయన అభిమానులు ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇక అందు లో భాగంగానే ఆయన ఒక ఇంటర్వ్యూ లో తన అభిమాన డైరెక్టర్ల గురించి ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది.  అందులో తెలుగులో ఆయనకు నచ్చిన డైరెక్టర్లు ఎవరంటే సుకుమార్, రాజమౌళి పేర్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే వీరిద్దరూ పాన్ ఇండియా లో తమ సత్తాని చాటుకుంటూ వెళ్తున్నారు.కాబట్టి వాళ్ళంటే తనకి చాలా ఇష్టమని చెప్పినట్టు గా తెలుస్తుంది. ఇక తను ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయకపోయిన కూడా రాజమౌళి అంటే తనకు అమితమైన గౌరవం ఉందని ఆయన తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన డైరెక్టర్ గా ఆయనంటే అందరికీ అమితమైన ఇష్టం ఉంటుంది అంటూ తను చెప్పినట్టుగా తెలు స్తుంది.  ఇక ఇది ఇలా ఉంటే సుకుమార్ తో ప్రస్తుతం అల్లు అర్జున్ నాలుగో సినిమా చేస్తు న్నాడు. వీళ్ళ కాంబో లో సినిమా ఎప్పుడు వచ్చిన కూడా అది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గానే నిలిచిపోతుంది. అందులో భాగం గానే ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరొకసారి వీళ్ళిద్దరూ భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా గా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది...చూడాలి మరి పుష్ప 2 తో అల్లు అర్జున్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: