'టిల్లు స్క్వేర్' మూవీ ట్రైలర్ కే హైలేట్ గా నిల్చిన సీన్ అదేనా....??

murali krishna
సిద్దు జొన్నలగడ్డ .. తాజా గా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. ట్రైలర్ సూపర్ డూపర్ గా మంచి పాజిటివ్ కామెంట్స్ దక్కిం చుకుంది .గతంలో తెరకెక్కిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్క బోతుంది అని అందరి కీ తెలిసిందే . ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డతో రొమాన్స్ చేయ బోతుంది అనుపమ పరమేశ్వరన్ . ఎప్పుడూ చాలా సైలెంట్గా ట్రెడిషనల్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా లో పూర్తిగా హద్దులు మీరి పోయింది.కారు లో టిల్లు గాడి పైకెక్కి రొమాన్స్ చేస్తూ డీప్ లిప్ లాక్ల తో పెదాలను కొరికేసిన సీన్ హైలెట్గా మారింది . ట్రైలర్ మొత్తాని కి అభిమానులు ఇదే క్లిప్ ను రీ ప్లే చేసి చేసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు .. అంటే అనుపమ ఎంతలా హీట్ పెంచేసిందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా సోషల్ మీడియా లో సిద్దు జొన్నలగడ్డ సినిమా కి తీసుకున్న రెమ్యూనరేషన్ వైరల్ గా మారింది . ఈ సినిమా కోసం సిద్ధూ జొన్నలగడ్డ ఏకం గా ఐదు కోట్లు చార్జ్ చేస్తున్నాడట.నిజానికి టైర్ 3 హీరోల కి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడం చాలా చాలా గొప్ప అని చెప్పాలి. టైర్ టు హీరోలే 10 -15 రేంజ్ రెమ్యూనరేషన్ తీసు కుంటున్నారు . మరి నిన్న కాక మొన్న ఇండస్ట్రీలో కి వచ్చి ఒకే హిట్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ కు ఐదు కోట్లు రెమ్యూనిరేషన్ ఇస్తున్నారు అంటే అది గ్రేట్ అని చెప్పాలి . అంతేకాదు ఇదే విషయాన్ని పలువురు వ్యంగ్యం గా ట్రోల్ చేస్తున్నారు. ఏంటి అనుపమ వాడి పైకి ఎక్కి.. ఆమె ముద్దులు పెట్టింది ..దానికోసమే ఐదు కోట్లా..? వీడి పనే బాగుంది . లక్ అంతా వీడి దగ్గరే ఉంది అంటూ వెటకారం గా కౌంటర్స్ వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: