నాచురల్ స్టార్ నాని పోయిన సంవత్సరం చివరలో హాయ్ నాన్న అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కొత్త దర్శకుడు అయినటువంటి శౌర్యవ్ దర్శకత్వం వహించగా ... మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇకపోతే ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను కూడా ఎంత గానో అలరించింది. ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే బుల్లి తెరపై ప్రసారం కాబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే హాయ్ నాన్న మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే నాని , వివేక్ కాంబోలో రూపొందిన అంటే సుందరానికి సినిమా మంచి విజయం సాధించడంతో వీరి కాంబో లో రూపొందుతున్న రెండవ సినిమా అయినటువంటి సరిపోదా శనివారం సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.