వచ్చే శనివారం "సరిపోదా శనివారం" నుండి క్రేజీ వీడియో..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న నటులలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఇకపోతే ఈయన ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో నాని కి జోడి గా నటిస్తోంది. ఈ మూవీ ని డి వి వి దానయ్య నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ లో దర్శకుడు మరియు నటుడు అయినటువంటి ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఈ చిత్ర బృందం ప్రకటించలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయాలి అనే ఉద్దేశం లో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు ... కాకపోతే ఇప్పటికే ఆ తేదీన పుష్ప పార్ట్ 2 మూవీ నీ విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది.
 


ఒక వేళ ఈ సినిమా కనుక పోస్ట్ పోన్ అయినట్లు అయితే ఆ తేదీన ఈ మూవీ ని విడుదల చేయాలి అనే సరిపోదా శనివారం మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప పార్ట్ 2 ఆగస్టు 15 వ తేదీన కచ్చితంగా విడుదల అయినట్లు అయితే సరిపోదా శనివారం చిత్ర బృందం మరో విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు వచ్చే శనివారం ఈ సినిమా నుండి ఓ స్పెషల్ ట్రీట్ ను ఇవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే శనివారం ఈ సినిమా నుండి ఒక గ్లిమ్స్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. వరుస విజాయలతో ఫుల్ జోష్ లో ఉన్న నాని నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: