ఎన్టీఆర్ అభిమానులు అస్సలు హ్యాపీగా లేరు.. ఎందుకో తెలుసా?

praveen
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాపై మొదటి నుంచి కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల దేవర సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులందరిలో ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇక ఎన్టీఆర్ దేవర సినిమా విషయంలో మాత్రం తారక్ ఫ్యాన్స్ అంత సంతోషంగా లేరు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేయడమే కారణం.

 ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈపాటికి దేవర సినిమా రిలీజ్ కౌంట్ లో ఉండాల్సింది. సినిమా మొదలైనప్పుడే 2024 ఏప్రిల్ 5వ తేదీన తప్పకుండా సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇక నెల కిందటి వరకు కూడా ఇదే మాటకు కట్టుబడి ఉన్నారు ఇక అంతలోనే షూటింగ్ సమయంలో విలన్ సైఫ్ అలీ ఖాన్ గాయపడటం.. ఇక మరికొన్ని కారణాలతో చివరికి ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే దేవర సినిమా వాయిదా పడుతుందని ముందునుండి వార్తలు వచ్చిన తారక్ అభిమానులు నమ్మలేదు. అయితే ఏప్రిల్ కాకపోతే కనీసం సమ్మర్ చివర్లో ఆగస్టు లోపు సినిమా విడుదల ఉంటుందని అందరూ అనుకున్నారు.

 కానీ అక్టోబర్ 10న ఎవరు ఊహించని విధంగా అక్టోబర్ 10న సినిమా రిలీజ్ అంటే తారక్ అభిమానులు అందరూ కూడా దేవర మూవీ కోసం ఇంకో ఎనిమిది నెలలు వేచి చూడాల్సిందే. అయితే అరవింద సమేత తర్వాత ఏకంగా 4 ఏళ్ల పాటు త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఎదురుచూశారు ఎన్టీఆర్ అభిమానులు. కనీసం తర్వాత సినిమా అయినా త్వరగా వస్తుంది అనుకుంటే ఇలా ఆలస్యం అవుతూ ఉండడంతో ఇక తారక్ అభిమానులు అస్సలు హ్యాపీగా లేరట. కొత్త విడుదల తేదీ పై ఒక క్లారిటీ ఇవ్వడం బాగానే ఉంది. కానీ మరి అంత లాంగ్ డేట్ పెంచుకోవడం మాత్రం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఫై తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: