పవర్ స్టార్ కు పోటీ ఇవ్వనున్న యంగ్ టైగర్....??
కొంతమందైతే ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే ఏ సినిమా సత్తా ఏంటనేది తెలుస్తుంది అని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య క్లాషేస్ వచ్చినా రెండు సినిమాలు సక్సెస్ అయ్యే అవకాసం ఉందంటోంది ట్రేడ్. పాన్ ఇండియా సినిమా లుగా వస్తున్న ఓజీ,దేవర రెండు సినిమాల మీద దేనికదే కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి.డైరక్టర్ సుజిత్ కూడా ఇంతకుముందు ప్రభాస్ తో చేసిన సాహో సినిమా తెలుగులో ఓకే అనిపించుకున్నా బాలీవుడ్ లో బాగా సక్సెస్ అయింది. కాబట్టి తనకి కూడా అక్కడ మంచి మార్కెట్ ఉంది. డైరెక్టర్ పరంగా చూసుకున్న, హీరో పరంగా చూసుకున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓజి , దేవర సినిమాలు వేటికవే పందెం కోళ్లలా ఉన్నాయి. అయితే ఆ అంచనాల వల్లే భారీ ఓపెనింగ్స్ వస్తాయి.ఇక 'అరవింద సమేత' చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుండి సోలో హీరో సినిమా రాలేదు. rrr చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ క్రేజ్ ని దక్కించుకున్న తర్వాత చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రం కావడం తో ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, ఆడియన్స్ కూడా ఎంతో ఇంట్రస్ట్ గా ఎదురుచూస్తున్నాపవన్ కళ్యాణ్ అయితే రీ ఎంట్రీ తర్వాత ఆయన వరుసగా మూడు రీమేక్ సినిమాలు చేసాడు. ఈ టైమ్ లో రీమేక్ కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమా చెయ్యాలని పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ ఆయన ఏకంగా 'ఓజీ' లాంటి పాన్ ఇండియన్ చిత్రం చెయ్యడం తో వాళ్లలో ఎక్కడలేని ఉత్సాహం మళ్ళీ తిరిగి వచ్చింది. కాబట్టి రెండూ చిత్రాలు పోటాపోటీగా ఉన్నాయి. ఈ పోటీ లో ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి.అయితే ఓపినింగ్స్ తెచ్చుకోవటం వరకూ స్టార్ హీరోలు చేయగలిగినా కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే బాగా ఆడతాయనేది ఇప్పటివరకు చాలా సినిమాలు ప్రూవ్ చేస్తూ వస్తున్నాయి. రీసెంట్ గా సంక్రాంతి సినిమాలా విషయం లో కూడా ఇది ప్రూవ్ అయింది. బరిలో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నా కూడా ఒక యంగ్ హీరో అయిన తేజ సజ్జా భారీ సక్సెస్ కొట్టాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాలో కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అదే సక్సెస్. ఇక ఇప్పుడు ఓజీ, దేవర మధ్య పోటీ లో కూడా కంటెంట్ ఉన్న సినిమా మాత్రమే సక్సెస్ అవుతుంది.