ఆ సాంగ్ చేయడానికి షారుఖ్ ఖానే కారణమంటున్న ప్రియమణి....!!

murali krishna
నటి ప్రియమణి ఆ మధ్య షారుక్  ఖాన్, దీపికా నటించిన చెన్నై ఎక్స్‌ ప్రెస్ మూవీ లో ఓ ఐటెమ్ సాంగ్ లో నటించింది.అయితే ఆ సాంగ్ పై ఇన్నాళ్ల కు ఆమె స్పందించింది.తన లేటెస్ట్ మూవీ ఆర్టికల్ 370 ప్రమోషన్ల లో భాగం గా ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూ  లో ప్రియమణి మాట్లాడింది.తనకు షారుక్ ఖాన్ అంటే ఇష్టమని, అతని పక్కన నటించాలన్న ఉద్దే తోనే చెన్నై ఎక్స్‌ప్రెస్ లో ఆ పాట కు అంగీకరిం చానని ప్రియమణి తెలిపింది.. నిజానికి ఆ సినిమా తర్వాత అలాంటి ఐటెమ్ సాంగ్స్ చేయాల్సింది గా తనకు ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా తాను తిరస్క రించానని, కేవలం షారుక్ కోస మే ఆ పాట చేసినట్లు ఆమె స్పష్టం చేసింది.

చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీ లో 1234 గెట్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్ అనే పాట లో ప్రియమణి.. షారుక్ ఖాన్ తో చిందులేసింది. “షారుక్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని ద్వేషించే వాళ్లు ఉండొచ్చు. కానీ అతన్ని ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువగా ఉన్నారు. నేను కలిసిన మంచి మనసున్న వాళ్లలో షారుక్ ఖాన్ ఒకరు. ఆయన మహిళలతోనే కాదు అందరి తోనూ ఎంతో మర్యాదగా నడుచుకుంటారు.. ప్రతి ఒక్కరితో ఎలా ఉండా లో నేను ఆయన నుంచే నేర్చుకున్నాను” అని ప్రియమణి చెప్పింది.”షారుక్ తో చెన్నై ఎక్స్‌ప్రెస్ రోజుల నుంచీ మంచి సంబంధాలు ఉన్నాయి. నా డ్యాన్స్ ఎక్క డో చూసి రోహిత్ శెట్టి, షారుక్ ఖాన్ తమను కలవడానికి రమ్మని పిలవడం నాకు ఇప్పటి కీ గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు” అని ప్రియ మణి తెలిపింది. ఆ తర్వాత కూడా గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీలో ప్రియమణి కీలక పాత్ర లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: