మహేష్ - రాజమౌళి మూవీ టైటిల్ పిక్స్.. ఇదేనట?

praveen
దర్శకతీరుడు రాజమౌళి ఒక సినిమా చేస్తున్నాడు అంటే కేవలం ఇండియన్ క్రికెట్ పరీక్షకులు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే బాహుబలి రెండు సినిమాలతో పాటు త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు రాజమౌళి. ఇక రాజమౌళితో ఒక్క సినిమా చేసిన చాలు అని ఇక మహా మహా స్టార్ హీరోలు సైతం ఆశ పడుతుంటారు అని చెప్పాలి. అయితే మొన్నటికి మొన్న ఎన్టీఆర్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి త్రిబుల్ ఆర్ లాంటి మల్టీస్టారర్ తీశారు.

 ఈ సినిమా అందరూ ఊహించినట్లుగానే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు రాజమౌళి  అమెజాన్ అడవుల్లో అడ్వెంచర్స్ నేపద్యంలో ఈ సినిమా ఉండబోతుంది అని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా ఈమెనే అంటూ ఎంతో మంది పేర్లు కూడా తేర మీదికి వస్తూ ఉన్నాయి.  అయితే ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే మహేష్ బాబు ట్రెక్కింగ్ శిక్షణ కూడా తీసుకుంటున్నాడు అన్న విషయంపై కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కాగా ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కె సినిమాకు ఏ టైటిల్ పెడతారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.

 అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన మూవీకి టైటిల్ ఇదే అంటూ ఒక వార్త ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక దీంతో ఇక టైటిల్ పై కూడా ఎన్నో రూమర్స్ తెర మీదికి వస్తున్నాయి. అడ్వెంచర్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నాడట జక్కన్న. అయితే గతంలో త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, రామారావు, రాజమౌళి పేర్లు కలిసేలా టైటిల్ ఉంది. ఇక ఇప్పుడు మహారాజులో మహేష్ బాబు, రాజమౌళి పేర్లు కలిసేలా టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: