ప్రభాస్ కల్కికి హెడేక్ గా మారిన లీక్స్..!

shami
ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి సినిమా నుంచి లీక్స్ ఆ చిత్ర యూనిట్ కి హెడేక్ గా మారాయి. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా సూపర్ హీరో మూవీగా వస్తుంది. సినిమాలో ప్రభాస్ లుక్స్ క్రేజీగా ఉన్నాయి. మే 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి లీక్స్ షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే అంతకుముందు సినిమా నుంచి ఒక ఫోటో లీక్ కాగా లేటెస్ట్ గా సినిమా నుంచి సోల్జర్స్ తో ప్రభాస్ ఉన్న ఫోటో ఒకటి లీక్ అయ్యింది.
ఈ లీక్స్ వల్ల డైరెక్టర్ నాగ్ అశ్విన్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. ప్రభాస్ కల్కి సినిమాపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సినిమా హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుందని తెలుస్తుంది. సినిమాపై బజ్ విపరీతంగా ఉంది.
ప్రభాస్ కల్కి సినిమా నుంచి ఈ లీక్స్ రాకుండా చిత్ర యూనిట్ ఎంత జాగ్రత్త పడుతున్నా సరే ఏదో ఒక విధంగా లీక్ అవుతూనే ఉన్నాయి. కల్కి సినిమా విజువల్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయని తెలుస్తుంది. కల్కి సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ను కూడా నాగ్ అశ్విన్ రెండు భాగాలుగా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. మే 9న అసలైతే కల్కి రిలీజ్ ప్లాన్ చేసినా అనుకున్న టైం కు సినిమా వస్తుందా రాదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రభాస్ ఈ సినిమాతో పాటుగా రాజా సాబ్ ని కూడా ఒకేసారి షూట్ చేస్తున్నాడు. రాజా సాబ్ మాత్రం 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: