నాకు అలాంటి భర్త కావాలి... శ్రీ లీల..!

Pulgam Srinivas
ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ యువ నటిమని శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తాజాగా మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాల ప్రదర్శన తో , డాన్స్ తో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోను మరికొన్ని ఇతర మూవీ లలోను హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై మాత్రం ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

అందులో భాగంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి ... అతనికి ఎలాంటి అలవాట్లు ఉండాలి అనే విషయాలను చెప్పుకొచ్చింది. నాకు ఫన్నీ మరియు జోవియల్ గా ఉండే అబ్బాయి కావాలి. ఎందుకు అంటే బ్రెయిన్ తో చేసే పనులు నేను చూసుకుంటా ... ఫన్నీగా జోవియల్ గా ఉండే అబ్బాయి అంటే నాకు బాగా ఇష్టం అని శ్రీ లీల చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం చేతి నిండా సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ నటి మరోవైపు "ఎం బి బి ఎస్" చదువుతో తన ఎడ్యుకేషన్ కూడా మంచి దిశలో ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: