తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న
యువ నటి మనులలో రూహణి శర్మ ఒకరు. ఈ
బ్యూటీ రాహుల్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందిన "చి లా సౌ" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ
మూవీ తర్వాత ఈమెకు పెద్దగా గుర్తింపు గలిగిన
సినిమా లలో అవకాశం రాలేదు. కొంత కాలం క్రితం ఈ నటి "హర్" అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఈ
బ్యూటీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.
ఇకపోతే ప్రస్తుతం ఈమె
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా
శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వంలో రూపొందుతున్న ఆపరేషన్
వాలెంటైన్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఇకపోతే తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ సినిమా.లోని రుహాని శర్మ కు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్
పోస్టర్ ను విడుదల చేసింది. ఈ
మూవీ లో రూహాని శర్మ ... దాన్య శర్మ పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన రూహాని శర్మ కు సంబంధించిన టైటిల్
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాని
మార్చి 1 వ తేదీన తెలుగు ,
హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ
సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ
మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ
సినిమా ఏ స్థాయి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.