సందీప్ కిషన్ కు అదృష్టంగా మారబోతున్న కాలం !

Seetha Sailaja
యంగ్ హీరో సందీప్ కిషన్ కు హిట్ అన్న పదం విని దాదాపు కొన్ని సంవత్సరాలు దాటిపోయింది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీ తరువాత ఈ యంగ్ హీరో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఆసినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడ తెలియని పరిస్థితి. అయినప్పటికీ అతడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితులలో ‘ఈగల్’ మూవీ పరాజయం ఈ యంగ్ హీరోకు అదృష్టంగా మారుతుందా అన్న అంచనాలు కొందరిలో ఉన్నాయి. ఈవారం విడుదల కాబోతున్న ‘ఊరి పేరు భైరవకోన’ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ హడావిడి చేస్తూ ఉండటంతో ఈసినిమా విడుదలకు ముందురోజు దాదాపు 60 ప్రీమియర్ షోలు వేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికితోడు ‘ఈగల్’ కలక్షన్స్ అంతంత మాత్రంగా ఉండటంతో ఈమూవీకి కావలసినన్ని ధియేటర్లు దొరుకుతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు విడుదల అయిన సినిమాలాలో నిజమైన హిట్ ఒక్క హనుమాన్ కు తప్ప మరే సినిమాకు రాలేదు. ప్రస్తుతం చాలామంది ప్రేక్షకులు సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీలను  బాగా ఆదరిస్తున్నారు. ఈమూవీ దర్శకుడు విఐ ఆనంద్ ఇంటెన్స్ సబ్జెక్ట్ తో ఈమూవీని తీశాడు అన్న వార్తలు వస్తున్నాయి.

ఈసినిమాకు అంచనాలకు అనుగుణంగా పాజిటివ్ టాక్ వస్తే ఈమూవీకి కలక్షన్స్ ప్రవాహం వచ్చి తీరుతుంది. దీనికితోడు ఈమూవీకి పోటీగా మరొక సినిమా పోటీగా విడుదల అవ్వకపోడంతో పాటు ఆతరువాత వచ్చేవారం కూడ సరైన సినిమాలు ఏవీ విడుదల లేకపోవడంతో ఈ మూవీకి దశ తిరిగినట్లు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఊహించని చిన్న సినిమాలు ఘన విజయం సాధిస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి ‘ఊరి పేరు భైరవ కోన’ కూడ చేరినా ఆశ్చర్యం లేదు. గతకొంత కాలంగా సందీప్ కిషన్ మార్కెట్ చాల ఒడుదుడుకులకు లోనవ్వడంతో అతడి సినిమాలను కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదు అని అంటారు. ఇప్పుడు ఈమూవీ హిట్ అయితే ఆపరిస్థితులు మారే ఆస్కారం ఉంది..


.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: