చిక్కుల్లో పడిన 'బేబీ' మూవీ దర్శక నిర్మాతలు....!!
శిరీన్ సాయిశ్రీరామ్ మాట్లాడుతూ.. తాను 'ప్రేమించొద్దు' అనే షార్ట్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేసి, నిర్మించి, విడుదల చేశానని, 'బేబీ' దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత శ్రీనివాస్ కుమార్ నా అనుమతి లేకుండా కథనుకాపీ చేసి తమ లో వాడుకున్నారని ఆరోపించాడు. దర్శకురాలు శిరిన్ సాయిశ్రీరామ్ గతంలో 'కన్నా ప్లీజ్' అనే కథను 'బేబీ' చిత్ర దర్శకుడు సాయి రాజేష్‌కి వినిపించారు. ఆ తర్వాత అదే కథను 'ప్రేమించొద్దు' అనే షార్ట్ ఫిల్మ్‌గా తీశారు. కానీ సాయి రాజేష్ తాను చెప్పిన కథను నిర్మాత ఎస్‌కెఎన్‌కి చెప్పాడని శిరీన్ సాయిశ్రీరామ్ ఆరోపించాడు. ఒకే సమయంలో ఇద్దరు యువకులను ప్రేమించే ఓ యువతి కథే 'బేబీ'. లో ఇచ్చిన సందేశం కూడా సరైనది కాదు అని.. యువతులపై ద్వేషాన్ని పెంచుతోందని కొందరు ఆరోపించారు. అయితే ఈ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ హిందీలో కూడా రీమేక్ కానుంది. ఇప్పుడు ఇలా పోలీస్ కేసు నమోదు కావడం పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.