ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వం లో విష్ణు విశాల్ హీరో గా లాల్ సలామ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి లింగు సామి మరియు ఐశ్వర్య రజనీ కాంత్ కథను అందించగా ... సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ... లైకా ప్రొడక్షన్స్ సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ ఫిబ్రవరి 9 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం ఏ మాత్రం ప్రభావం చూపలేక పోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి జెమినీ సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ యొక్క కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అలా "ఓ టి టి" లో కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీ లో ప్రసారం కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇకపోతే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు కూడా ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.