అఫీషియల్ : "నా సామి రంగ" ఓటిటి విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నా సామి రంగ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్ లు దక్కాయి.

అలాగే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను సాధించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి స్టార్ మా సంస్థ దక్కించుకుంది. ఇకపోతే తాజాగా ఈ సంస్థ వారు ఈ సినిమాని ఏ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు.

తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ వారు నా సామి రంగ సినిమాని ఫిబ్రవరి 17 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో అశిక రంగనాథ్ హీరోయిన్ గా నటించగా ... విజయ్ బిన్నీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: