ఆ "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "అయాలాన్"..!

Pulgam Srinivas
కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ తాజాగా ఆయాలాన్ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన తమిళ భాషలో విడుదల చేశారు. ముందుగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇదే తేదీన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి రెండు సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉండడం ... అలాగే ఆ తర్వాత కూడా వరుసగా మరో రెండు తెలుగు సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని తెలుగులో జనవరి 12వ్వ తేదీన విడుదల వాయిదా వేసుకుంది. ఇకపోతే ఈ సినిమా జనవరి 12 వ తేదీనే తమిళ భాషలో విడుదల అయ్యి అక్కడ మంచి విజయాన్ని అందుకుంది.
 

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ సంస్థ వారు తమిళ భాషలో ఈ రోజు నుండి అనగా ఫిబ్రవరి 9 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తోంది అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా తమిళ భాషలో సన్ నెక్స్ట్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk

సంబంధిత వార్తలు: