RC 15, 16 లకి ఆ హిట్ సెంటిమెంట్ కలిసోస్తుందా?

Purushottham Vinay
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమా పనులు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. తన 15వ సినిమా గేమ్ ఛేంజర్ షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో 16 వ సినిమా పనులు ప్రారంభించారు.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఆడిషన్ పనులు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఈసారి ఉత్తరాంద్ర ప్రతిభకు బుచ్చి బాబు పట్టం కట్టే పనిలో పడ్డాడు. విశాఖ.. విజయ నగరం ..శ్రీకాకుళం జిల్లాల మారుమూల ప్రాంతాల వారికి ఛాన్స్ కల్పిస్తూ స్టార్ హంట్ ని నిర్వహిస్తున్నాడు.ప్రతిభావంతులు ఎవరైనా తన సినిమాలో ఛాన్స్ వినియోగించుకోవాలని కోరాడు.ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా వచ్చింది. ఈ మూవీలో చరణ్ రెండు పాత్రల్లో కనిపించు న్నాడుట.ఆ రెండు వేటికవి ప్రత్యేకంగా ఉంటాయని... ఓపాత్ర మన్యం జీవిన శైలిని పోలి ఉంటుందని అంటున్నారు. బుచ్చిబాబు ఉత్తరాంద్ర నటుల్ని తీసుకోవడం వెనుక కూడా ఈ లాజిక్ ఉందని సమాచారం వినిపిస్తుంది.ఆ పాత్ర సినిమాలో చాలా బలంగా ఉంటుందని...మెయిన్ లీడ్ ఇదే అవుతుందని సమాచారం తెలుస్తుంది. మరి ఇందు లో నిజమెంత ఉందో తెలియాలి.



అలాగే మరోవైపు చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో కూడా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ పొలిటికల్ కమ్ తనదైన మార్క్ సమాజంపై సెటైరికల్ గా సినిమా ఉంటుందని ఇప్పటీకే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పాత్రని రెండు రకాలుగా డిజైన్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది.సో దీన్ని బట్టి రామ్ చరణ్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో డ్యూయల్ రోల్ పోషించడం ఆసక్తికరమే.ఇలా డ్యూయల్ రోల్ చరణ కి ప్లస్ అయితే అభిమానులకు పండగే. ఇప్పటి దాకా చరణ్ మూడు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసాడు. మొదటిసారి రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర`లో పోషించాడు. ఈ సినిమా చరణ్ ని 100 కోట్ల హీరోని చేసింది. ఆ తరువాత వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన `నాయక్ లో కూడా డ్యూయల్ రోల్ చేసాడు. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. ఇక గేమ్ చేంజర్, RC 16 కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: