సిద్దు... వైష్ణవి కాంబో మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఇకపోతే ఈయన ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ఈ సంవత్సరం మార్చి 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ డిజె టిల్లు అనే మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. డీజే టిల్లు మూవీ సూపర్ సక్సెస్ కావడంతో టిల్లు స్క్వేర్ మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ సినిమాతో పాటు సిద్దు "తెలుసు కదా" అనే మరో సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రాసి కన్నా , నేహా శెట్టి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
 


ఇలా ప్రస్తుతం రెండు మూవీ ల షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ నటుడు కొన్ని రోజుల క్రితమే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో కూడా ఓ మూవీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువబడింది. ఈ సినిమాలో బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ప్రకటించారు. తాజాగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ వారు సిద్దు ... వైష్ణవి కాంబోలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ ను రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో 37 వ మూవీ గా రూపొందబోతున్నట్లు కూడా ఈ బ్యానర్ వారు అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: