పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ "ఓజి" లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఓ చిన్న వీడియోని విడుదల చేయగా అది అదిరిపోయే రేంజ్ లో ఉండడం దానికి తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించడంతో ఈ చిన్న వీడియో తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉంది అని ఓ వార్త తెగ వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో నిలబడి చేతిలో ఓ టీ కప్పు పట్టుకొని ఉన్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ విజయం సాధిస్తుందా లేదా తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.