
మెగాస్టార్ సినిమాలో.. మహేష్ బాబు హీరోయిన్?
అయితే విశ్వంభరా మూవీలో చిరంజీవి సరసన ఏ హీరోయిన్ నటించబోతుంది అనే విషయంపై కథ కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో ఒక్కరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్లు ఉండబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే సీనియర్ హీరోయిన్ త్రిష విశ్వంభరా సెట్స్ లో అడుగుపెట్టి షూటింగ్లో పాల్గొంటుంది అంటూ ఒక టాకు వినిపిస్తుంది. త్రిష తో పాటు ఇక మరో ముగ్గురు కథానాయకుల ఎంపిక చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారట. ఈ క్రమంలోనే ఇందులో ఒకానొక హీరోయిన్గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారట. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ మూవీ కోసం సరికొత్త లోకాన్ని సృష్టించబోతున్నాడట డైరెక్టర్ వశిష్ట. అయితే దేవకన్య పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించబోతుందట.
కాగా ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి వరుసగా అవకాశాలు అందుకుంటుంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం అనే సినిమాలో నటించింది. మహేష్ బాబు మరదలు పాత్రలో నటించి తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇక మంచి విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే.