ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్.. ఇంత రిస్క్ చేస్తున్నాడేంటి?

praveen
మెగాస్టార్ చిరంజీవి 60 ప్లస్ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ జోరు  చూపిస్తున్నారు. ఇక ఇటీవల దేశంలోనే అత్యున్నతమైన రెండోపురస్కరమైన పద్మ విభూషణ్ నూ కూడా దక్కించుకున్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో మెగా అభిమానులందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. బింబిసారా అనే మూవీ తర్వాత వశిష్ట చేస్తున్న రెండో సినిమా ఇది కావడం గమనార్హం. సోషియో ఫాంటసీ  మూవీగా తెరకెక్కుతున్న సినిమాపై భారీ  అంచనాలు ఉన్నాయి.

 మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఈ మూవీ అతిపెద్ద హిట్ కావడం ఖాయమని మెగా అభిమానులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇక తర్వాత సినిమాలో డైరెక్టర్లను కూడా లైన్ లో పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఒక డైరెక్టర్ తో సినిమా ఒప్పుకొని మెగాస్టార్ చిరంజీవి రిస్క్ చేశాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. బీవీఎస్ రవి ఇటీవల చిరంజీవిని కలిసి కథ వినిపించాడట. అయితే స్టోరీ లైన్ విని చిరు ఎంతగానో ఎగ్జిట్ అయ్యారట. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట.

 ఒకవేళ స్క్రిప్ట్ లాక్ అయితే బివిఎస్ రవి డైరెక్షన్లో మెగాస్టార్ సినిమా తెరకెక్కుతుంది. అయితే దర్శకుడు రవికి అంతకు మంచి పేరు ఇప్పటివరకు రాలేదు. సాయి ధరంతేజ్ తో గతంలో జవాన్ అనే సినిమా తీసి నిరాశపరిచాడు. అయితే బివిఎస్ రవి కథ రెడీ చేసినప్పటికీ దర్శకత్వం మాత్రం మరొకరు చేయబోతున్నారట. ఏకంగా కళ్యాణకృష్ణ దర్శకత్వంలో సుష్మిత కొణిదల నిర్మాణంలో చిరంజీవి ఒక సినిమా చేయాల్సి ఉండగా.. బివిఎస్ రవి చెప్పిన కథతోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది అన్నది తెలుస్తుంది. అయితే ప్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి చిరంజీవి రిస్క్ చేస్తున్నాడు అంటూ ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: