లాల్ సలాం: ఆ దేశాల్లో బ్యాన్?

Purushottham Vinay
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తాజాగా ఆయన గెస్ట్ రోల్‌లో నటిస్తున్న మూవీ లాల్ సలాం. ఆయన కుమార్తే ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీలో జీవితా రాజశేఖర్ కూడా కీలక పాత్రలో కనిపిస్తుంది. స్పోర్ట్స్ బేస్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మతకల్లోల కథాంశం ప్రధానంగా కనిపించనుందట. అయితే మొదట ఈ మూవీని సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని మేకర్స్‌ భావించారు.అయితే కొన్ని పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో.. రిలీజ్ డేట్ ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇప్పటికే సెన్సార్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రిలీజ్ సమస్యలు ఎదురవుతున్నాయని మీడియా వర్గాల సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సినిమాని కూవైట్ దేశంలో బ్యాన్ చేశారట.


కువైట్ కి ఇతర దేశాల సినిమాల రిలీజ్ పరంగా రూల్స్ అనేవి చాలా స్ట్రిట్ గా ఉంటాయి. అక్కడ సినిమాల బ్యాన్ చేయడానికి ఆ మూవీలో ఉండే కంటెంట్ ప్రధాన కారణం. ఆ దేశాల్లో చాలా ఆంక్షలుతో సినిమాలు విడుదల చేస్తారు. కంటెంట్ ఏ మాత్రం తేడాగా అనిపించిన వారు సినిమాను బ్యాన్ చేసేస్తూ ఉంటారు. అక్కడ ప్రభుత్వాలు ఈ నేపథ్యంలోనే లాల్ సలాం మూవీని కూడా సెన్సిటివ్ కాన్సెప్ట్ ఉందని.. హిందూ, ముస్లిం ఘర్షణకు సంబంధించిందని అందుకే బ్యాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.మిడిల్ వెస్ట్ లో కూడా ఇలాంటి సెన్సిటివ్ సినిమాలపై సెన్సార్ కఠినంగా ఉంటుందట. దీంతో ఇక్కడ కూడా సినిమా బ్యాన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తుంది. ఇక రజనీకాంత్.. లాల్ సలాం మూవీలో గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నప్పటికీ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థల లైక ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. ఇక ఈ మూవీకి బిజినెస్ కూడా రజిని ఈ సినిమాలో ఉండడంతోనే భారీగా జరుగుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: