హీరో శింబుతో పెళ్లిపై.. క్లారిటీ ఇచ్చిన బాలయ్య చెల్లెలు..!!
వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్యకాలంలో పెళ్లి విషయంలో తరచూ వైరల్ గా మారుతోంది . గతంలో కోలీవుడ్ హీరోలతో లవ్ ఎఫైర్ నడిపినట్టుగా కూడా రూమర్స్ వినిపించాయి.. అయితే వాటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టినప్పటికీ ఇటీవలే హనుమాన్ సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలాంటి సమయంలోనే కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన శింబు తో సినిమాలలో నటించి అందరిని మైమరిపించింది.
అయితే వీరిద్దరి కుటుంబాల మధ్య కూడా మంచి స్నేహబంధం ఉండడంతో శింబు వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం పైన తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ స్పందిస్తూ.. శింబుతో తన పెళ్లి జరగడం లేదని అతను మంచి మిత్రుడు అంటూ కితాబ్ ఇచ్చింది.. మా గురించి వచ్చే వార్తలలో అసలు నిజం లేదంటూ కూడా తెలిపింది.. అసలు ఇలాంటి విషయాలను ఎవరు నమ్మకండి అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ విషయాలను కొట్టిపారేసింది. గత ఏడాది బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ. వరలక్ష్మి అభిమానులు మాత్రం ఏమి పెళ్లి గురించి ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అంటూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.