టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ ఆఖరుగా డిజె టిల్లు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ.ని సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ తో సిద్దు కు తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే డిజె టిల్లు మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే సినిమాని రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటిస్తూ ఉండగా ... అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ను ఫారన్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ను దుబాయి లో ప్లాన్ చేసినట్లు ... అందులో భాగంగా మరో నాలుగు ఐదు రోజుల్లో ఈ మూవీ బృందం దుబాయ్ కి వెళ్ళబోతున్నట్లు అక్కడ ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే డీజే టిల్లు మూవీ సూపర్ సక్సెస్ కావడంతో టిల్లు స్పేర్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.