నాగశౌర్య బ్లాక్ బస్టర్ మూవీకి నేటితో ఆరేళ్లు..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో నాగ శౌర్య ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాల్లో హీరో గా నటించాడు. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే నాగ శౌర్య కెరియర్ లో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సినిమా లలో చలో మూవీ ఒకటి. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం అయింది. ఇకపోతే ఈ సినిమాకు వెంకీ కొడుముల దర్శకత్వం వహించాడు.


ఈయన ఈ సినిమా తోనే దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ.కి మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా 2018 వ సంవత్సరం ఫిబ్రవరి 2 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే పెద్ద అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే సూపర్ పాజిటివ్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది.


దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఓవరాల్ గా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా విడుదల అయ్యి నేటితో ఆరేళ్లు పూర్తి అవుతుంది. ఇకపోతే ఈ సినిమా లోని నాగ శౌర్య , రష్మిక నటన లకు వెంకీ కుడుముల ఈ సినిమాని తెరకెక్కించిన విధానానికి గాను వీరికి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ns

సంబంధిత వార్తలు: