పవన్ డైరెక్టర్ తో చిరు మూవీ..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొంత భాగం ఇప్పటికే పూర్తి అయినప్పటికీ చిరంజీవి మాత్రం ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాలేదు. ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ రేపటి నుండి అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ కాబోతోంది. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఈ మూవీ బృందం ఓ భారీ సెట్ ను కూడా నిర్మించింది. ఇకపోతే రేపటి నుండి స్టార్ట్ కాబోయే ఈ మూవీ షెడ్యూల్ లో చిరంజీవి కూడా జాయిన్ కాబోతున్నాడు.


ఇది ఇలా ఉంటే చిరంజీవి "విశ్వంభర" మూవీ తో పాటు ఏక కాలంలో మరో సినిమాలో కూడా నటించాలి అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గత కొన్ని రోజులుగా కథలను వింటూ వస్తున్న చిరంజీవి తాజాగా ఓ కథను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ సినిమాకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని ప్రారంభించాడు.


ఇక పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆ సమయంలో ఈయన రవితేజ తో మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కంప్లీట్ చేసి ఆ వెంటనే చిరంజీవి తో ఈయన ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి కి హరీష్ కథను వినిపించగా ఆ కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాని చిరంజీవి కూతురు సుస్మిత మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వారు సంయుక్తంగా నిర్మించబోతున్న ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: