తమిళ్ తో పోలిస్తే తెలుగులో "లియో" కి ఘోరమైన "టిఆర్పి" రేటింగ్..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ ఆఖరుగా లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించగా ... సంజయ్ దత్ , అర్జున్ సర్జ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అదే స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.


ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ్ లో బుల్లి తెర పై ప్రసారం అయ్యింది. ఇకపోతే ఈ మూవీ తమిళ్ లో మొదటి సారి బుల్లి తెర పై ప్రసారం అయినప్పుడు ఏకంగా 16.30 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది.


అలా ఈ మూవీ తమిళ బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ తెలుగు లో జెమినీ టీవీ లో ప్రసారం అయింది. ఈ మూవీ కి తెలుగు లో మాత్రం బుల్లి తెర ప్రేక్షకుల నుండి భారీ స్థాయి రెస్పాన్స్ లభించలేదు. ఈ మూవీ మొదటి సారి జెమినీ టీవీ లో ప్రసారం అయినప్పుడు కేవలం 3 "టి ఆర్ పి" రేటింగ్ ను మాత్రమే తెచ్చుకుంది. ఇలా తమిళ్ తో పోలిస్తే ఈ సినిమాకి తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల నుండి చాలా తక్కువ స్థాయి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: