'గుంటూరు కారం' సినిమాతో హిట్టు కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాత చిత్రాన్ని ఎస్. ఎస్ రాజమౌళితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన ఈ
సినిమా కోసం
రాజమౌళి నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మూవీలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కూడా నటిస్తారని
రచయిత విజయేంద్ర
ప్రసాద్ ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సీనియర్
హీరో కింగ్
నాగార్జున ని కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలనే ఆలోచనలో
రాజమౌళి ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.నాగార్జునతో
రాజమౌళి కి మంచి రిలేషన్ ఉంది. గతంలో నాగర్జున 'రాజన్న' సినిమాకు
రాజమౌళి కూడా కొంత వర్క్ చేశారు.ఎందుకంటే ఆ మూవీకి ఆయన
తండ్రి విజయేంద్ర
ప్రసాద్ దర్శకత్వం వహించారు. మరోవైపు
రాజమౌళి, మహేష్ బాబు
సినిమా నిర్మాత కె.ఎల్. నారాయణతో కూడా నాగార్జునకు మంచి బాండింగ్ ఉంది.
గతంలో నాగార్జునతో కేఎల్ నారాయణ కొన్ని చిత్రాలని కూడా నిర్మించారు.ఇవన్నీ పక్కనపెడితే నాగార్జునకి
బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. గతంలో నాగ్ హిందీలో కూడా కొన్ని సినిమాలు చేశారు.నాగ్ లాస్ట్ టైం 'బ్రహ్మాస్త్ర' సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. నేషనల్ వైడ్ గా గుర్తుపట్టే తెలుగు హీరోల్లో
నాగార్జున కూడా ఒకరు కాబట్టి 'SSMB29' లో ఓ కీలకపాత్ర కోసం నాగార్జునను
రాజమౌళి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం తెలుస్తుంది.
రాజమౌళి సినిమాలో కీలక పాత్రలు ఎలాగైనా ఉంటాయి. కాబట్టి 'SSMB29' మూవీలో
నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం తెలుస్తుంది.మరి ఇందులో ఎంత వాస్తవం ఉందనేది తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత దాకా ఎదురు చూడాల్సిందే. ఇక ఏప్రిల్ నెలలో ఈ
సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. సుమారు 1000 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించబోతున్నారు.