2024 టాలీవుడ్ రిలీజెస్: మన బిగ్ స్టార్స్ ఎప్పుడొస్తారో?

Purushottham Vinay
ఈ సంవత్సరం అందరి హీరోల ఫ్యాన్స్ కి సూపర్ ఇయర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇయర్ లో అందరి టాప్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వారిలో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంతో వచ్చి అభిమానులని అలరింపచేశాడు. ఇక ఈ ఇయర్ లోనే ప్రభాస్, రామ్ చరణ్, తారక్, పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.కల్కి, పుష్ప, ఓజీ, దేవర, గేమ్ చేంజర్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాను నిర్మాత దిల్ రాజు సెప్టెంబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసిన కుదర్లేదు.బహుశా ఈ సినిమా దసరాకి ఎన్టీఆర్ దేవర సినిమాకి పోటీగా రిలీజ్ అవ్వొచ్చు.ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఒజీ సినిమా కూడా సెప్టెంబర్ 27 న విడుదల చేసేందుకు నిర్మాత దానయ్య రెడీ అవుతున్నాడు. దాదాపు ఇదే ఖరారు అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.


సుజిత్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా కోసం చాలామంది సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇక ఇప్పటికే వచ్చిన టీజర్ సాంగ్ ప్రేక్షకులను వేరే స్థాయి లో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం అందరు చాలా మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు ఉత్తరాంధ్ర, తెలంగాణాలో భారీగా రిలీజ్ చేయబోతున్నాడు.పవన్ కళ్యాణ్ నటించే చాలా సినిమాలు హోల్డ్ లో ఉన్నాయి. అలాంటిది ఈ సినిమా ఆ డేట్ కి రిలీజ్ కావడం నిజంగా పవన్ అభిమానులను అలరించే విషయం.ఇకపోతే మెగా అభిమానులు ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న ఈ సినిమా రావడం వారికీ ఖచ్చితంగా పండగ లాంటిదే. పుష్ప 2 సినిమా ఆగస్ట్ 15 వ తేదీన రిలీజ్ కి ఫిక్స్ అయింది. ఒక వేళ ఈ మూవీ పోస్ట్ అయితే ఆ డేట్ కి దేవర, ఇండియన్ 2, కంగువ సినిమాలు వచ్చే అవకాశం ఉంది.కల్కి సినిమా అయితే సమ్మర్ లో రావడానికి రెడీగా ఉంది. మరి చూడాలి ఏ స్టార్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: