18 రోజుల్లో "గుంటూరు కారం" కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం ఈ మూవీ జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి 18 రోజుల్లో నైజాం ఏరియాలో 33.80 కోట్ల కలెక్షన్ లు దక్కగా ,  సిడెడ్ ఏరియా లో 9.70 కోట్లు ,  ఉత్తరాంధ్ర లో  12.59 కోట్లు , ఈస్ట్ లో 9.76 కోట్లు , వెస్ట్ లో 5.97 కోట్లు , గుంటూరు లో 8.29 కోట్లు , కృష్ణ లో 6.46 కోట్లు , నెల్లూరు లో 3.67 కోట్ల కనెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ కి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి 90.24 కోట్ల షేర్ ... 139.29 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 18 రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.55 కోట్లు , ఓవర్ సీస్ లో 14.71 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.


మొత్తంగా 18 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 111.50 కోట్ల షేర్ ... 183.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ దాదాపు 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగగా ఈ సినిమా మరో 21.50 కోట్ల షేర్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ప్రాసెస్ లో భాగంగా 84 శాతం కలెక్షన్ లను మాత్రమే రాబట్టింది. దానితో ఈ మూవీ మరో 16 శాతం షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. రమ్య కృష్ణ , జయరామ్ , ప్రకాష్ రాజ్  రావు రమేష్ , రాహుల్ రవీంద్రన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: